చరిత్ర సృష్టించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్.. మోదీ చేతుల మీదుగా ఘన ప్రారంభం…

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నేడు నిజమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. సుమారు ₹5,600 కోట్ల వ్యయంతో, 2,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు…





