కొత్తగా నియమితులైన టీచర్ల నిరసన.. జగన్ ప్రచారంపై ఆగ్రహం…

కర్నూలు: డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు కర్నూలులో నిరసనకు దిగారు. కొండారెడ్డి బురుజు వేదికగా నిర్వహించిన ఆత్మగౌరవ నిరసనలో టీచర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని వారు స్పష్టం చేశారు.
