మొబైల్ తయారీకి రూ.62,500 కోట్లతో కేంద్రం భారీ పథకం…

కేంద్ర ప్రభుత్వం: కేంద్ర క్యాబినెట్ రూ. 62,500 కోట్ల బడ్జెట్‌తో మొబైల్ ఫోన్ తయారీ పథకం MPMS కు ఆమోదం తెలిపింది. భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచడానికి, స్వదేశీ విలువను పెంపొందించడానికి, సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి మరియు అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఈ వినూత్న పథకాన్ని ఆమోదించింది. ప్రపంచ పోటీతత్వం పెంపే లక్ష్యంగా ఈ పథకం అమలుకానుంది. కీలక భాగాల దేశీయ సేకరణకు 1.5% వరకు అదనపు ప్రోత్సాహకం, భారతీయ బ్రాండ్‌లు, డిజైన్ & R&D అభివృద్ధికి అర్హత గల అమ్మకాలపై 3% అదనపు ప్రోత్సాహకం అందించనుంది. దీంతో స్వదేశీ తయారీ, ఆవిష్కరణలకు మరింత ఊతం లభించనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x