అనర్హత తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్..

హైదరాబాద్ : దానం నాగేందర్ అనర్హత వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

మరోవైపు, దానం నాగేందర్ పిటిషన్‌పై తమ వాదనలు వినిపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు.

దీంతో నేటి విచారణపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x