చరిత్ర సృష్టించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్.. మోదీ చేతుల మీదుగా ఘన ప్రారంభం…

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నేడు నిజమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు.

సుమారు ₹5,600 కోట్ల వ్యయంతో, 2,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 4 కోట్ల మంది ప్రయాణికులకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్‌మోహన్ నాయుడు మాట్లాడుతూ, “ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారమైన చారిత్రాత్మక రోజు” అని అన్నారు.

విమానాశ్రయం ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. దీంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, రవాణా రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఆగస్టు 17 నుంచి ఈ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానుండటంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *