నేపాల్‌లో మత ఉద్రిక్తతలు.. బోల్బం ఊరేగింపు తర్వాత హింస, ముగ్గురు మృతి..

నేపాల్‌లో మత ఉద్రిక్తతలు.. బోల్బం ఊరేగింపు తర్వాత హింస, ముగ్గురు మృతి

నేపాల్‌ : బోల్బం ఊరేగింపు సందర్భంగా తూర్పు నేపాల్‌లోని సున్సరి జిల్లా కప్తాన్‌గంజ్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం హింస సిరహా, ధనుషా సహా మధేష్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలకు వ్యాపించింది. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఘర్షణలకు కారణమైన ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని వర్గాలు ఊరేగింపుపై ముందుగా దాడి జరిగిందని ఆరోపిస్తుండగా, మరికొన్ని వర్గాలు మతపరమైన ప్రదేశాలపై దాడులు జరిగాయని పేర్కొంటున్నాయి. అధికారిక విచారణ పూర్తయ్యే వరకు ఈ ఆరోపణలు ధృవీకరించబడలేదు.

ఈ ఘటనల నేపథ్యంలో హిందూ సంఘాలు భద్రత కల్పించాలని, తమ మతపరమైన కార్యక్రమాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే నేపాల్‌ను తిరిగి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలన్న తమ డిమాండ్‌ను మరోసారి వినిపించాయి. అనంతరం ప్రభుత్వం, హిందూ సంఘాల మధ్య జరిగిన చర్చలతో నిరసనలు విరమించగా, కొన్ని ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు.

ప్రధానమంత్రి బాలేంద్ర షా ప్రజలు శాంతి, సామరస్యాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తూ, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x