
పిఠాపురం : నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన ప్రారంభమైంది. ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రూ.73 లక్షలతో అభివృద్ధి చేసిన చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. అనంతరం చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించి చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. గ్రామ సచివాలయం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని కూడా పరిశీలించారు.
