
మాట మంతి’ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
సీతంపేట : మండలం కడగండి గ్రామంలో నిర్వహించిన ‘మాట మంతి’ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
అనంతరం గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
