బోరున ఏడ్చేసిన ఫరియా అబ్దుల్లా.. అసలేం జరిగిందంటే?

కన్నీళ్లు పెట్టుకున్న ‘చిట్టి’..?

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన మత విశ్వాసాలు, కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఇస్లాంపై నమ్మకంతో ఆ మతాన్ని స్వీకరించారని ఆమె తెలిపారు. తాను కూడా ఇస్లాం గురించి మంచి విషయాలను చెబుతుంటానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన “అల్లా అన్నింటా ఉంటారు” అనే మాటలను గుర్తు చేసుకుంటూ ఫరియా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను ద్వేషించే వారిని సైతం తాను ప్రేమిస్తానని చెప్పారు.

ఇటీవల బోనాల ఉత్సవాల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొనడంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తన విశ్వాసాలను, ఇతరుల పట్ల తన గౌరవాన్ని ఫరియా భావోద్వేగంగా వివరించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x