
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి, వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
అంతేకాకుండా పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
“ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది” అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

