రొయ్యల మేత ధరలు నియంత్రించాలి: కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి: రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను స్థిరీకరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆక్వా ఉత్పత్తి వ్యయం 20%కిపైగా పెరిగిందని తెలిపారు. ఆక్వా రంగానికి రక్షణగా దేశీయ మార్కెట్ బలోపేతం, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు..
