
హైదరాబాద్: దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. కుటుంబానికి పార్టీ తరఫున మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
పిల్లల చదువు, భవిష్యత్తుతో పాటు కుటుంబ సంక్షేమాన్ని పార్టీ పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
