
అమరావతి: ఏపీలో ‘దిశ’ వ్యవస్థను ఉపసంహరించుకోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూపొందించిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
‘దిశ’ ద్వారా SOS అలర్ట్‌లు, ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్లు, గ్రామస్థాయిలో మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, ఫోరెన్సిక్ సేవలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ వల్ల మహిళలపై నేరాల దర్యాప్తు సమయం 156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గిందని, 2024 నాటికి మహిళలపై నేరాలు 27% తగ్గాయని పేర్కొన్నారు.
BNS ఉన్నంత మాత్రాన ‘దిశ’ అవసరం లేదనడం సరికాదని జగన్ అన్నారు. మహిళలకు వేగంగా న్యాయం అందించే ‘దిశ’ వ్యవస్థను రద్దు చేయకుండా మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
